మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టిడిపి నేతలు

 

చిలకలూరిపేట: మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా, చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు చిలకలూరిపేట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు , పట్టణ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మోదుకూరి వెంకట శివరామ్ గార్ల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు తన్నీరు పుల్లారావు గారు అధ్యక్షత వహించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించి, నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తదుపరి శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో సుమారు 50 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తన్నీరు పుల్లారావు, మోదుకూరి వెంకట శివరామ్ గార్లను పలువురు పార్టీ నేతలు ప్రశంసించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిబోయిన శివ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, తెలుగుదేశం పార్టీ బీసీ(దాసరి) సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ తుపాకుల అప్పారావు, రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాస రావు(R.T.C), చిలకలూరిపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండా వీరయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్, చిలకలూరిపేట నియోజకవర్గం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి జంజనం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సినీయర్ నాయకులు గాలం కోటి, మారుబోయిన శ్రీనివాస రావు, నిమ్మకాయల ప్రసాద్, గుమ్మా ప్రసాద్ లు ప్రసంగించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారన్నారు. అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అన్నారు. మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమంలో భాగంగా జంగా వినాయకరావు, షేక్ జానీభాష, షేక్ అజారుద్దీన్, షేక్ జాకీర్, షేక్ అబ్దుల్ భాష, జి.సి యూత్ షేక్ కరిముల్లా గార్లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యలమందల పోతురాజు, అన్నపురెడ్డి నాగరాజు, బాలరాజు, గోపిదేశి గంగాధర్, గోపిదేశి ప్రసాద్, ఒంటిపులి వెంకట్, దండగిరి శ్రీరామ్ ప్రసాద్, మద్దిబోయిన శేఖర్, మిద్దెల పూర్ణ సింగ్, మాధవ్ సింగ్, ఉదయ శంకర్ సింగ్, శ్రీరామ్ మూర్తి బత్తుల, లక్ష్మణ సింగ్, ఏలూరి నాగేశ్వరరావు(ENR), గోపిదేశి శేఖర్, కురిచేటి వీరబ్రహ్మం, వడాల సాంబశివరావు, మద్దుమాల రవి, వడ్డాని సుబ్బారావు, చిన్న నాయక్, రాయి పద్మ, రాయి సుబ్బారావు, గారపాటి కిరణ్, పునుగుపాటి యాకోబు, కారుమంచి వివేకనంద, బడుగు జాకబ్ రాజు, ఇనగంటి బెంజిమెన్, షేక్ బాజీ,S.M.ఉమర్, మండవ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*