
విశాఖ మన్యం జిల్లా: అరకులో పెను ప్రమాదం తప్పింది. ఓ టూరిస్టు బస్సులో మంటలు చెలరేగాయి. కణాల్లో బస్సు ఆగ్నికి ఆహుతైంది. ఘాట్ రోడ్డులోని రెండో నెంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా చిల్లూరుకు చెందిన 24 మంది పర్యాటకులు అరకు లోయ సందర్శన కోసం ప్రైవేటు బస్సులో బయల్దేరారు. విహారయాత్ర ముగించుకొని తిరిగి వెళ్తుండగా.. టైడా సమీపంలోని ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా బస్సులో మంటలు చేలరేగాయి.
దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేసి.., ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వారంతా బస్సులోంచి బయటకు వచ్చేశారు. మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే బస్సు కాలి బూడిదైంది. పర్యాటకుల లాగేజీ పూర్తిగా కాలిపోవటంతో వారు. కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బస్సు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు.
Be the first to comment