వైసిపి,టీడీపీ కౌన్సిల్ సభ్యుల వాగ్వివాదల నడుమ ముగిసిన కౌన్సిల్ సమావేశం…

 

  • వైసిపి,టీడీపీ కౌన్సిల్ సభ్యుల వాగ్వివాదల నడుమ ముగిసిన కౌన్సిల్ సమావేశం…
  • టీడీపీ సభ్యుల మీడియా సమావేశంలో మాట్లాడిన మునిసిపల్ చైర్మన్ రఫాని, పొంతనలేని సమాధానాలను మీడియా సాక్షిగా చెప్పారు.


చిలకలూరిపేట:- నేడు జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏజండా చదవిన తర్వాత వైసీపీ కౌన్సిలర్ మౌలాలి మాట్లాడుతూ తను అవినీతి చేశానని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు దీనిపై గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మిమ్మల్ని ప్రశ్నించటం జరిగింది అవినీతికి పాల్పడ్డారో లేదో అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 10 వ వార్డు పరిధిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగినట్లు దానికి సుమారు1లక్ష 67 వేల రూపాయలు నిధులు వెచ్చించినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు వాస్తవం ఏమిటో మీ ద్వారా అధికారులు సభలో తెలియజేయాలని డిమాండ్ చేశారు దీని పై కొంత సేపు వైసీపీ కౌన్సిలర్లకు గంగా శ్రీనివాసరావు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది దీనిపై చైర్మన్ సర్ది చెబుతూ అధికారులు కూడా ఆ సమాచారం సరైనది కాదని చెబుతున్నారని ఈ విషయంపై రాద్ధాంతం అవసరం లేదన్నారు. టిడ్కో గృహాలపై టీడీపీ సభ్యురాలు శివపార్వతి అడిగిన ప్రశ్నకు చైర్మన్ షేక్ రఫాని సమాధానం ఇస్తూ డిసెంబర్ 15 లోగా మొదటి విడతగా కొంతమంది లబ్దిదారులకు టిడ్కో గృహాలు అందజేస్తామని, మిగిలిన వారికి జనవరి నెలాఖరుకు గృహాలు అందజేయనున్నట్లు తెలిపారు.

మౌలిక వసతుల కల్పన, లబ్దిదారులకు అన్ని వసతులు కల్పించటానికి ప్రయత్నిస్తున్నామని అందువల్లనే జాప్యం జరుగుతుందని వెల్లడించారు.ఈ విషయం పై టీడీపీ సభ్యులు కల్పించుకుంటూ తమ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు లబ్దిదారులకు అందజేయటానికే సంవత్సరాల సమయం పట్టిందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో వైఎస్సార్ సీపీ సభ్యులు కల్పించుకోవటంతో తిరిగి వివాదం చెలరేగింది. ఇంటిని నిర్మాణం చేసుకొనే సమయంలో ఎవరైనా అన్ని వసతులు ఉన్నాయా లేవా అని చూసుకుంటామని అటువంటిది వేలాది మందికి ఇంటి నిర్మాణం చేసే సమయంలో కనీసం డ్రైనేజీ నీళ్లు బయటకు పోయే మార్గం గురించి ఆలోచించ లేకపోవటం గమనరహం.

ఎటువంటి వసతులు కల్పించకుండానే మూడు సార్లు గృహ ప్రవేశాలు అంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నడపారని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆరోపించారు. అనంతరం టీడీపీ సభ్యుడు గంగా శ్రీనివాసరావు ఎపి టిట్ కో గృహాల సముదాయ ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేశామని బిల్లులు పెట్టటం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు మున్సిపల్ చైర్మన్. మునిసిపల్ కమిషనర్ ఇరువురు పొంతనలేని సమాధానం చెప్పటం ఎమిటిని చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు వ్యక్తం చేశారు సహనం కోల్పయిన చైర్మన్ అసలు ఇళ్ల నిర్మాణానికి కావల్సిన 52 ఎకరాల స్థల సేకరణ దివంగత ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ వల్ల సాధ్యమందన్నారు.ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ కౌన్సిల్ సభ్యులు, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతో చైర్మన్ సభ ముగిసిందని ప్రకటించి బయటకు వచ్చారు. వైస్ చైర్మన్ టిడిపి కౌన్సిల్ నేత రంగా శ్రీనివాసరావు మీద తీవ్రంగా వాదోపవాదాలు జరిగాయి నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అని ఒకరిపై ఒకరు తీవ్రంగా అక్షేపించారు. టీడీపీ సభ్యులు కౌన్సిల్ హాలు బయట నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ సభ్యులతో పాటు అదే మీడియా సమావేశంలో మాట్లాడిన మునిసిపల్ చైర్మన్ రఫాని ఏపీ టిట్ కో గృహలపై. మద్ది నగర్ ప్రాంతంలో 32 మందికి ఆక్రమణలు తొలగించాలని ఇచ్చిన నోటీసులు తన దృష్టికి రాలేదని తన వద్దకు బాధితులు ఎవరు రాలేదని పొంతనలేని సమాధానాలను చైర్మన్ రఫాన మీడియా సాక్షిగా చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*