
చిలకలూరిపేట : భారత కమ్యూనిస్టు పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమితి, నాదెండ్ల మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం నాదెండ్ల మండల తాసిల్దార్ ఎంవి రమణ కి వినతి పత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏరియా పార్టీ ఇంచార్జ్ కార్యదర్శి నాగభైర రామసుబ్బాయమ్మ మాట్లాడుతూ మండలంలో నేటికీ ప్రారంభం కానీ జగనన్న గృహాలను ప్రారంభించి ప్రభుత్వం ప్రతి గృహానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రంతో పాటు అర్జీలు ఇవ్వటం జరిగింది . కార్యక్రమంలో నాగబైరు రామసుబ్బాయమ్మ, పట్టణ పార్టీ సెక్రటరీ పేలూరి రామారావు, నాదెండ్ల మండల సిపిఐ పర్వతనేని లక్ష్యాధికారి, గొట్టిపాటి నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చౌటపల్లి నాగేశ్వరరావు,బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment