
హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. 2009లో వచ్చిన ‘అరుంధతి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు. 1935లో జన్మించిన సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లా, కౌతవరం మండలం, గుడ్ల వల్లేరు కాగా.. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. రేపు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Be the first to comment