
- మెగా పవర్ స్టార్ రాం చరణ్ త్వరలోనే ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు…?
- అది కూడా విశాకపట్నం వేదికగా.. ఎంటీ నమ్మట్లేదా..? నిజమండీ బాబు.
- ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్దఎతున జరుగుతున్నాయి.
- ప్రాంగణమంతా పసుపు తోరణాలతో.. ఎల్లో బోర్టులతో కళకళలాడిపోతోంది.
- రాం చరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది టీడీపీకి మద్దతుగానా అని డౌటనుమానమా. అదేమీ కాదండీ.
- ఆయనే సపరేట్‌గా ఓ పార్టీ పెట్టి.. దాని కోసమే ప్రచార సభ నిర్వహిస్తున్నారు.
- కావాలంటే మీరూ ఆ సభకు వెళ్లి చూడండి.
రాం చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది రియల్ లైఫ్‌లో కాదండీ.. రీల్ లైఫ్‌లో. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఆర్సీ 15 సినిమాలో చరణ్.. డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారంటా. అందులో ఒకటి రాజకీయ నేత పాత్ర అయితే ఇంకోటి ఎన్నికల అధికారి పాత్ర అని టాక్. ఈ సినిమాలో చరణ్ సీఎం కూడా అవుతారంటా. అయితే ఆయన పార్టీ పేరు అభ్యుదయం పార్టీ. గుర్తేమో ట్రాక్టర్ అంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన సెట్ ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో సభా ప్రాంగణం అంతా పసుపు తోరణాలతో ఉండటం.. బోర్డు కూడా ఎల్లో కలర్‌లో ఉండటం గమనార్హం. ఇదే కాకుండా.. కొన్ని ఫొటోల్లో చరణ్ సైకిల్ మీద కన్పిస్తున్నారు కూడా. ఇవన్నీ చూస్తుంటే.. సినిమాలో టీడీపీని రిప్రజెంట్ చేస్తూ.. ఆ పార్టీని ప్రమోట్ చేన్నారేమో..? అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Be the first to comment