
చిలకలూరిపేట: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెదేపా నేతల ఆధ్వర్యంలో పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రివర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు , రవీంద్ర గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. తదుపరి పార్టీ నేతలు కూడా రవీంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్ అధ్యక్షత వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు జంగా వినాయక రావు దంపతులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, పరిటాల రవి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు… ఏ అండా లేని సామాన్యుడికి ఒక భరోసా అన్నట్టు జీవించారని, జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరు సాగించిన చరితార్థుడు రవి అని, పేద ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం జరిపి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ హోదాల్లోఉన్ననాయకులు, టిడిపికౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు/సెక్రెటరీలుతదితరులు పాల్గొనడం జరిగింది.
Be the first to comment