
చిలకలూరిపేట: పట్టణంలోని YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువనాయకులు విడదల గోపి ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు,జాతీయ పతాకాన్ని ఎగరవేసి, వందన సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని,రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం నుంచి భారత దేశం విముక్తి పొంది సొంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుందని, 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటికీ సొంతంగా రాజ్యాంగం అంటూ లేదు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, నవంబర్ 26,1949లో రాజ్యాంగం రూపొందించగా 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిందని అన్నారు.
అటువంటి మహనీయులు రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మంత్రి విడదల రజిని SC, ST, BC,మైనారిటీ సోదరులందరికి స్థానిక పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని,అలానే ముఖ్యమంత్రి జగన్ కూడా బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. అలానే మల్లి రానున్న ఎన్నికలలో అందరూ కలిసి ఎమ్మెల్యే గా విడదల రజినిని గెలిపించుకొని, ముఖ్యమంత్రిగా జగన్ ని చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు, జడ్పీటీసీలు,కౌన్సిలర్లు,ఎంపీటీసీలు సర్పంచులు,వివిధ అనుబంధ విభాగాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to comment