
బతుకుదెరువు కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడు రోజులకే ఊహించని విధంగా మృత్యువు వెంటాడింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లికి చెందిన రవికుమార్ ఈ నెల 17న మరో 10 మందితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరారు.
బుధవారం సాయంత్రం రవికుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం వెంటాడింది. అతడు ప్రమాదవశాత్తూ కంటెయినర్‌పై నుంచి జారిపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులకు గురువారం కంపెనీ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. ఆయనకు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలున్నారు. మృత దేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Be the first to comment