UPI పేమెంట్స్‌లో మోసాలు… ఎవరైనా మీ ఫోన్ లేదా మీ UPI పిన్ అడుగుతున్నారంటే మోసం చేస్తున్నారని గ్రహించాలి: బాపట్ల జిల్లా SP వకుల్ జిందాల్ IPS

 

బాపట్ల జిల్లా(పోలీస్ ప్రధాన కార్యాలయం): UPI పేమెంట్స్‌లో మోసాలు… తెలియని వ్యక్తులు మీ దుకాణాలు, షాపుల వద్ద వస్తువులు కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని, ఎవరైనా మీ ఫోన్ లేదా మీ UPI పిన్ అడుగుతున్నారంటే మోసం చేస్తున్నారని గ్రహించాలి: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు

మీరు డబ్బులు స్వీకరించాలనుకుంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుంచుకోండి: జిల్లా ఎస్పీ గారు

చాలావరకు యూపీఐ మోసాలు యూజర్లు అప్రమత్తంగా లేకపోవడం వల్లే జరుగుతుంటాయి. ఒకసారి డబ్బులు పోయిన తర్వాత తిరిగిపొందడం అంత సులువు కాదు: జిల్లా ఎస్పీ గారు

దుకాణదారులు అపరిచిత వ్యక్తులకు యూపీఐ పిన్ నెంబర్ చెప్పవద్దని, యూపీఐ మోసాల పట్ల విజ్ఞతతో ఉండాలని, ఒక్కసారి సైబర్ నేరస్తుల వలలో పడి డబ్బులు పొతే తిరిగిపొండటం చాల కష్టమని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు తెలిపారు. యూపీఐ పేమెంట్స్‌ మోసాలు గురించి మాట్లాడుతూ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయడం, పేమెంట్స్ (Online Payments) చేయడం చాలా సులువైపోయింది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఉపయోగించి సులువుగా లావాదేవీలు చేసేస్తున్నారు. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ కూడా క్షణాల్లో జరిగిపోతున్నాయి.ఎవరైనా తెలియని వ్యక్తులు మీ దుకాణాలు, షాపుల వద్ద వస్తువులు కొనుగోలు చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు చెల్లిస్తామని మీ మొబైల్ ఫోన్ తీసుకొని మీ ఫోన్ నుండి ముందుగా 1/-రూపాయ్ ని సెండ్ చేసుకొని తర్వాత యూపీఐలో మనీ రిక్వెస్ట్ పంపి మీ అకౌంటులోని ఉన్న డబ్బు మొత్తం దొంగిలిస్తారు. కావున ఎట్టి పరిస్థితులలోను మీ ఫోన్ ఇతరులకు ఇవ్వడం కానీ OTP చెప్పడం కానీ చేయకూడదు అని తెలిపారు.

అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఇలాంటి లింక్స్‌తోనే మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

యూపీఐ పేమెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోవాల్సి వస్తుందని. ఒకవేళ మీరు మోసానికి గురైతే వెంటనే సంబంధిత బ్యాంక్, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*