వలపర్ల లో ఏలూరి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన – 650 మంది హాజరు 350 మందికి కంటి చికిత్సకు రిఫర్

 

  • వలపర్ల లో ఏలూరి మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
  • 650 మంది హాజరు 350 మందికి కంటి చికిత్సకు రిఫర్

వలపర్ల:  గ్రామంలో ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్స్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి , అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు,స్వర్గీయ ఏలూరి నాగేశ్వరరావు గారి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి క్యాంపును ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వైద్య శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మొత్తం 650 మంది హాజరుకాగా 350 మందిని కంటి వైద్య శస్త్ర చికిత్సకు వైద్యులు రిఫర్ చేశారు.

కంటి వైద్య శిబిరానికి హాజరైన వారికి ప్రత్యేక షామియనాలు వేశారు. పురుషులకు మహిళలకు వేరువేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్యాంపుకు హాజరైన వారికి బీపీ, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ శిబిరంలో డాక్టర్ అనీషా డాక్టర్ మమతలు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుకామేపల్లి హరిబాబు, నిర్వాహకులు ఫుల్లెల అజయ్ బాబులు మాట్లాడారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో గత 15 ఏళ్లుగా ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్విస్తున్నారని పేర్కొన్నారు.

లక్ష మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడం లక్ష్యంగా నిరంతరం కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు సేవ చేసేందుకురాజకీయాలకతీతంగా ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాలు, మోకాళ్ళ ఆపరేషన్లు, మెగా వైద్య శిబిరాలునిర్వహిస్తున్నారన్నారుఆరోగ్యవంతమైన సమాజం కోసం ఎమ్మెల్యే ఏలూరి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బషీర్, జంజనం సుబ్బారావు, బూరగ వీరయ్య, కంభంపాటి హనుమంతరావు,గుంటి వెంకటేశ్వర్లు,గౌస్, మార్టూరు పట్టణ అధ్యక్షుడు కామినేని జనార్ధన్,శానంపూడి చిరంజీవి, మిన్న కంటి రవి తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*