చిలకలూరిపేట నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు “టెన్ పాయింట్ ఫార్ములా” అమలు చేయాలి : లోక్ సత్తా పార్టీ మాదాసు భాను ప్రసాద్

 

చిలకలూరిపేట నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు “టెన్ పాయింట్ ఫార్ములా” అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని కోరిన స్థానిక లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భాను ప్రసాద్.

 

చిలకలూరిపేట: పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు టెన్ పాయింట్ ఫార్ములా అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక లోక్ సత్తా పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని కలిసి వినతిపత్రం అందించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు…

  1. తిమ్మాపురం సెంటర్ నుండి గణపవరం వాగు వరకు డివైడర్ పై మొక్కల కుండీలు ఏర్పాటు, లేదా ఏదైనా ఒక రేకును వాహనాల లైటింగ్ ఒకదాని మీద ఒకటి పడకుండా ఏర్పాటు చేయాలని కోరారు.
  2. కళ్యాణి సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, నరసరావుపేట సెంటర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురు విధిగా ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
  3. వేకువజాము వేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదు అవుతున్నందున విధిగా ఆయా వేళల్లో పైన పేర్కొన్న నాలుగు ప్రధాన సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు విధులలో ఉండే లాగున ఏర్పాటు చేయాలి అని కోరారు.
  4. చిలకలూరిపేటకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని కోరారు.
  5. ఆగి ఉన్న లారీలను ఢీకొట్టడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నందున ఎట్టి పరిస్థితుల్లో వేకుజం వేళలో లారీలను హైవేపై ఆపకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
  6.  డ్రైవర్ల వ్యక్తిగత అవసరాల కోసం వాహనాల పార్కింగ్ను ఊరి చివర స్థలాన్ని కేటాయించడం కానీ మరి ఏదైనా నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలు నిలుపుకొనుటకు అవకాశం కల్పించాలని కోరారు.
  7. సర్వీసు రోడ్డు ఆక్రమణ గురై పాడైనందున మరమ్మతులు నిర్వహించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కోరారు.
  8. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, మహిళలు నరసరావుపేట సెంటర్, కళ్యాణ్ సెంటర్లలో నడిచి రోడ్డు దాటేవారి కోసం ప్రత్యేకంగా నాలుగు వైపుల నుండి రోడ్డు దాటే అవకాశం కల్పించాలని కోరారు.
  9. హైవే పెట్రోలింగ్ వారు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరారు.
  10. చిలకలూరిపేట హైవేపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున, రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పనిచేసే వారితో రోడ్డు సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మురికిపూడి ప్రసాద్, కృష్ణ ప్రసాద్, హరి ప్రసాద్, మురకొండ వెంకటరావు, కంద భాస్కరరావు, వెంకటేశ్వర్ రెడ్డి, తిరుమలేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*