
చిలకలూరిపేట: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెదేపా నేతల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ గారి 75వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రివర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. తదుపరి పార్టీ నేతలు కూడా మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, సత్యం, అహింస అనే ఆయధాలతో గాంధీజీ ప్రపంచానికి కొత్త దారి చూపి మహాత్ములయ్యారని, అందుకే ప్రపంచ దేశాలకు గాంధీయిజం ఇప్పుడొక పాఠమైందని, గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులు, ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచదేశాలకే అనుసరణీయం. భారతీయులుగా.. గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే, ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్య నాయకులు,పార్టీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, టిడిపికౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు/సెక్రెటరీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Be the first to comment