
చిలకలూరిపేట: జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు ఎంపికైన యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కట్టా నందప్రకాష్(నిహాల్ బాబు) కు జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
చిలకలూరిపేట పట్టణములోని అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న కార్యాలయంలో జాన్ సైదా సోమవారం మాట్లాడుతూ నందప్రకాష్ జాతీయస్థాయి పోటీలలో రాణించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎన్నిక కావాలని జాన్ సైదా గారు అన్నారు.ఈ కార్యక్రమంలో గొంటు శ్రీనివాసరెడ్డి, మానుకొండ శేషిరెడ్డి, నకరికంటి శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment