
టైర్లలో గాలి తీసేసిన ఎమ్మెల్యే ముస్తఫా !అయినా సూపర్బ్ సార్ అంటున్న స్థానికులు
గుంటూరు :M.L.A మొహమ్మద్ ముస్తఫాట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. సాధారణ పోలీస్ అనుకుంటున్నారా కాదండోయ్ టెక్నికల్ ట్రాఫిక్ పోలీస్ గా మా
రారు. ఎమ్మెల్యే ఏంటి ట్రాఫిక్ పోలీస్ ఏంటి అని అనుకుంటున్నారా ? అబ్బే ఏం లేదండి డొంకరోడ్డు మూడు వంతెనల వద్ద అటుగా ప్రయాణిస్తు
న్న ఒక భారీ వాహనం వంతెనల పై భాగాన్ని తాకి ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ముస్తఫా తన వాహనం నుండి కిందకు దిగి ఒక అటూ ఇటూ చూసి ఒక స్కెచ్ గీసి ఇరుక్కున్న వాహనం టైర్లలో గాలిని తీశారు. దీంతో ఆ వాహనం కొంచెం కిందకు దిగడంతో డ్రైవర్ తన వాహనాన్ని సురక్షితంగా బయటకు తెచ్చుకొని ఊపిరి పీల్చుకున్నాడు. వాహనం బయటకు రావడంతో ట్రాఫిక్ తో అప్పటి వరకూ ఇబ్బంది పడిన వాహనన చోదకులు ముస్తఫా చాటిన మానవత్వాన్ని చూసి సూపర్బ్ ఎమ్మెల్యే సాబ్ ముందుకు కదిలారు.
Be the first to comment