ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి గోవాడ నాగ సాయి గోపి అరుణ్ కుమార్ అనుమానాస్పద మృతి

 

మార్టూరు :

  • ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి న విద్యార్థి గోవాడ నాగ సాయి గోపి అరుణ్ కుమార్ (22) అనుమానాస్పద మృతి …
  • జాన్నతాలి లో విషాదo ..మృతదేహాన్ని స్వగ్రామం పంపిన స్నేహితులు
  • బాపట్ల జిల్లా , మార్టూరు మండలం జొన్నతాలి గ్రామంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన 7 నెలలకే ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో అర్ధాంతరంగా తనువు చాలించిన సంఘటన మండలం లోని జొన్నతాలి గ్రామంలో శనివారం వెలుగు చూసింది.
  • బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. స్థానిక గోవాడ రమేష్ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగ సాయి గోపి అరుణ్ కుమార్ (22) ఇంజనీరింగ్ పూర్తి చేసి ms చదవడం కోసం గత ఏడాది ఆగస్టు నెలలో అమెరికా వెళ్లాడు. లాం నార్ యూనివర్సిటీలో ms చదువుతూ టెక్స్ ఫోర్టన్ ఏరియాలో ఐదుగురు స్నేహితుల తో కలసి నివాసం ఉంటుండగా వారిలో ఒక యువతి కూడా ఉంది.
  • ఈ క్రమంలో మార్చి 1 వ తేదీ నుండీ అరుణ్ కుమార్ స్నేహితులకు కనిపించక పోవడంతో రూము లోనీ స్నేహితరాలి ఫిర్యాదు మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు ప్రారంభించారు .దర్యాప్తులో భాగంగా పోలీసులు మార్చి 3 వ తేదీ అరుణ్ కుమార్ మృత దేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సు లో గుర్తించి స్నేహితులకు ఇండియాలోని తండ్రి రమేష్ కు సమాచారం అందించారు.
  • శవ పరీక్ష అనంతరం అరుణ్ కుమార్ మృత దేహాన్ని అతని స్నేహితులు స్వంత ఖర్చులతో ఇండియా పంపించగ శనివారం మధ్యాహ్నం స్వగ్రామం జాన్నతా లి చేరింది. పోస్టు మార్టం నివేదిక వస్తె కానీ అరుణ్ కుమార్ మృతికి గల కారణం తెలియ రాదని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడు అని ఆశించి అమెరికా పంపిస్తే అర్ధాంతరంగా 7 నెలల కే శవమై తిరిగి వస్తాడని ఊహించలేదు అంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణనా తీతం.
  • ఈ ఉదంతంతో గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. సాయంత్రం గ్రామంలో అరుణ్ కుమార్ మృత దేహాన్ని కి అంత్య క్రియలు నిర్వ హిస్తున్నారు …

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*