
మార్టూరు:
- కంచె చేను మేసిన చందంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ మార్టూరులో మద్యం షాపు సూపర్వైజర్ల చేతివాటం తలపిస్తుంది. సహజంగా మద్యం షాపు సూపర్వైజర్లు ఆర్థిక లావాదేవీలతో పాటు షాప్ కు సంబంధించిన సరుకు, వాటికి సంబంధించిన రక్షణ విషయాలలో పూర్తి బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంటారు. కానీ ఇక్కడ కథ రివర్స్ మార్టూరులోని ఓ మద్యం షాపు సూపర్వైజర్ బి. కళ్యాణ్ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ మరి చేతివాటం ప్రదర్శిస్తున్నాడు.
- మద్యాన్ని ఎక్కువ మొత్తంలో వ్యక్తిగతంగా దాచిపెట్టి అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా మద్యాన్ని విక్రయిస్తూ వేలకు వేలు అక్రమంగా సంపాదిస్తున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. అంతేకాకుండా MLC ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మార్టూరు మండలం బలరాం కాలనీ నుండి రాబడిన సమాచారం మేరకు మేకల శ్రీను అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య పూర్ణ అద్దెకుంటున్న ఇంటిలో మద్యం బాటిళ్లను (139) స్టోర్ చేసి ఉంచగా, SEB CI M. యశోధర దేవి సిబ్బంది సహాయముతో వాటిని స్వాధీనపరచుకుని , మద్యం సీసాలు ఎక్కడివి అని అడుగగా అనంతవరం Govt. Retail Outlet: 08203 కు చెందిన B.కళ్యాణ్ సూపర్ వైజర్ తన ద్వారా నిల్వ ఉంచడాని మేకల శ్రీను తేలిపాడు.
- అంతట SEB CI యశోదరా దేవి, మేకల శ్రీను మరియు బి. కళ్యాణ్ మీద కేసు నమోదు చేసి పై అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసే సేల్స్ మెన్ కానీ సూపర్వైజర్ కానీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుటమైనది. సెబ్బ్ అధికారులకు ఆధారాలతో సహా దొరికిన ఇంటి దొంగ బి కళ్యాణ్ అనే సూపర్వైజర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేక రాజకీయ ఒత్తిడితో తలోగ్గి తూతూ మంత్రంగా పని కానిస్తారా అనేది వేచి చూడాల్సిందే. సహజంగా అధికార పార్టీకి చెందిన వ్యక్తులపై అంతంత మాత్రం గానే చర్యలు తీసుకుంటున్న తరుణంలో మరి ఇలాంటి ఇంటి దొంగలను ప్రోత్సహించటం ఎంతవరకు సమంజసం కాదు.
- అది ప్రభుత్వానికి అతనిని ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులకు ఎప్పటికైనా చేటుగానే మిగులుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వానికే మచ్చ తెచ్చేలా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ఇటువంటి మద్యం షాపు సూపర్వైజర్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా మిగతా మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందికి హెచ్చరికగా ఉంటుందని ప్రజలు తెలియజేస్తున్నారు.
Be the first to comment