అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం…. సీఐ యశోదరా దేవి

 

పర్చూరు :

  • స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ యశోదరా దేవి మంగళవారం మార్టూరులో ఇద్దరు వ్యక్తుల నుండి 57 గోవా మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్నారు.
  • పక్కాగా అందిన సమాచారంతో ఆమె తన సిబ్బందితో డిగ్రీ కళాశాల సమీపంలో కాపుకాసి ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలపై వస్తున్న షేక్ కరిముల్లా, కాటూరి రవి అనే వారిని పట్టుకుని సోదా చేయగా ఈ మద్యం సీసాలు దొరికాయి.
  • దీంతో మద్యాన్ని సీజ్ చేసి వారిద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
  •  నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నారు.
  • వీరికి మద్యం సరఫరా చేసిన కాటూరి చందు మీద కూడా కేసు నమోదు, చేసి పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నామని సీఐ యశోదరా దేవి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*