పాము కాటుకు వ్యవసాయ మహిళా కూలి మృతి

 

చిలకలూరిపేట :
నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో పాముకాటుకు మహిళ మృతి ….మృతురాలు భర్త ఫిర్యాదు మేరకు నాదెండ్ల SI భాస్కరావు దర్యాప్తు

  • నాదెండ్ల పోలీస్ స్టేషన్ కు రొంపిచర్ల మండలం, విప్పర్లపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన యoపాటి శ్రీనివాస్ రెడ్డి s/o సాంబిరెడ్డి, 52 సంరాలు, c/ రెడ్డి ఫిర్యాదు మేరకు అతని భార్య విజయలక్ష్మి అతను గత 4 సంవత్సరాల నుండి జంగాలపల్లి గ్రామంలో అద్దెకు ఇల్లు తీసుకుని  వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు .
  • ది. 16.03.2023 వ తేదీన ఉదయం అతని భార్య విజయలక్ష్మి, బాధినీడి కాటంరాజు మిరపపొలంలో మిరపకాయలు కోయడానికి కూలికి వెళ్లినట్లు అతను ప్రక్క పొలంలో మిరపపొలానికి నీళ్లు పడుతూ ఉన్నట్లు  సుమారు ఉదయం 11 గంటల సమయంలో నా భార్య పొలంలో మిరపకాయలు కోస్తూ ఒక్కసారిగా అరుస్తూ కిందపడిపోయినట్లు కూలి వాళ్లు నాకు చెప్పగా అంతట నేను నా భార్య దగ్గరకి వెళ్లి ఏం జరిగింది అని అడగ్గా, విజయలక్ష్మి ఎడమకాలు బొటనవేలుకి పాము కరిచినదని చెప్పింది.
  • అంతటా విజయలక్ష్మి ని అశోక్ లేలాండ్ వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు రాగా డాక్టర్  పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పినారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*