రాజకీయ ప్రచారం ద్వారా బిజెపి వ్యతిరేక విధానాలపై ప్రజలలో అవగాహన కల్పించాలి

 

అన్ని పక్షాలు బిజెపికి వ్యతిరేకంగా పని చేయాలి

ఈ నెల 26న పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఏప్రిల్ 5 చలో ఢిల్లీ జయప్రదంకై పిలుపు

సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య.

దేశానికి “మోదాని” ముప్పు పుస్తకావిష్కరణ.

నరసరావుపేట :

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి పక్షాలు,ప్రజా సంఘాలు ప్రజలు ఏకమై బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో పాటు దేశానికి నష్టం కలిగించే అనేక అంశాలపై ప్రజలలో చైతన్యం నింపాలని సిపిఎం కేంద్ర కమిటీ పికుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డు లోని పలనాడు విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో గురువారం జరిగిన సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశానికి సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా “దేశాన్ని రక్షించుకోవాలి స్వరాజ్యాన్ని కాపాడుకోవాలి” అనే నివాదంతో ప్రచార కార్యక్రమం చేపట్టిందన్నారు.

మోడీ ప్రభుత్వం దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నామని అదానికి రాష్ట్రాన్ని దోచి పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ శక్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజల అన్ని రకాల ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు ఆరోగ్యం, విద్య, వైద్య , వ్యవస్థలన్నీ నాశనం అయిపోతాయన్నారు. ఇటువంటి విధానాలను ప్రతిఘటించేందుకు సిపిఎం కంకణం కట్టుకుందని ఈ నేపథ్యంలోనే సిపిఎం దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు రాజకీయ ప్రచారాలు చేపట్టిందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టాక వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొందని లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని కార్మికుల హక్కుల రక్షణతో పాటు అనేక డిమాండ్లపై ఏప్రిల్ 5న లక్షలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీ రానున్నారని రాష్ట్రం నుంచి పల్నాడు జిల్లా నుంచి కూడా అధిక తరలిరావాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలు కూడా రాష్ట్రాన్ని దివాలా తీస్తున్న మోడీని విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ నేటి నుండి ఈనెల 31 వరకు సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో దేశాన్ని రక్షించుకుందాం “మోదాని” నుండి అనే ప్రచారాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేశ సంపదను కొంత మంది కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే పనిలో మోడీ ఉన్నారని ఇతర దేశాల సర్వే ప్రకారం చూస్తే భారతదేశంలో బోగస్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయని తెలిదన్నారు. ఇతర దేశాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ కనీసం పార్లమెంటులో చర్చ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా దేశ ప్రధాని మోడీ అధానిని కాపాడేందుకు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని ఇది రాష్ట్ర ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నుండి ఢిల్లీ తరలి వెళ్లే కార్మికులకు రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ఢిల్లీ వెళ్లే వారికి సిపిఎం ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

26న పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ శంకుస్థాపన..

ప్రజలందరికీ విజ్ఞానాన్ని పంచేందుకు విజ్ఞాన కేంద్రం ఆవశ్యకత ఎంతైనా ఉందని విజ్ఞానాన్ని అందించేందుకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అభ్యుదయ భావాల పెంపొందించేందుకు విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు పెద్దలు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని దీనికి అనుగుణంగానే పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఏర్పడిందని ట్రస్ట్ నిర్వహణకు భవన నిర్మాణానికి సిపిఎం పార్టీ సహాయ సహకారాలు అందించేందుకు సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్టు శంకుస్థాపన కార్యక్రమానికి మేధావులు, అభ్యుదయ భావాలు కలిగిన పెద్దలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.అదేవిధంగా పల్నాడు జిల్లాలో కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక అంశాలపై శాఖ కార్యదర్శిలను సన్నదం చేసేందుకు శాఖ కార్యదర్శిలకు ఏప్రిల్ నెలలో రాజకీయ పాఠశాల నిర్వహించినట్లు పేర్కొన్నారు. సిపిఎం నాయకులు కార్యకర్తలు కమిటీ పిలుపుమేరకు పనిచేయాలని కోరారు.

సీనియర్ నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ దేశంలో విపత్కమైన పరిస్థితులు నెలకొన్నాయని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ని విధించి దేశంలో ఉన్న అన్ని పార్టీలు అందరినీ ఒక చోటకు చేర్చి జైళ్లలో కుక్కిందని దీనికి అనుగుణంగా కొత్త తరహా విధానాలను బిజెపి ప్రభుత్వం దేశంలోకి తీసుకువచ్చిందని బిజెపి విధానాలు ఎదుర్కునే వారందరిపై ఈ.డి దాడులు చేయించడం అదాని వంటి వ్యక్తులతో డొల్ల కంపెనీలు సృష్టించడం దేశ సంపదను దేశ ప్రజలను టోకుగా అమ్మకం జరిపి ఎన్నికల్లో విజయం సాధించే వ్యూహాన్ని బిజెపి పన్నిందన్నారు. బిజెపి వ్యూహాన్ని ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు అన్ని పక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని బిజెపిని ఎలా ఎదుర్కొనాలి అనే వ్యూహాన్ని సిపిఎం అనుసరిస్తుందని సిపిఎంకు దేశ ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. బిజెపి దుర్మార్గాలను ఎదుర్కోనే దిశగా ప్రజలలో చైతన్యం నింపేందుకు సిపిఎం రాజకీయ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించిందన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. రవిబాబు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలో విస్తృతంగా మనుధర్మ శాస్త్ర భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట సమీపంలోని అనేక గ్రామాలలో ఘటనలు తమ దృష్టికి వచ్చాయని దళితులపై దాడులు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేసులు పూర్తిస్థాయిలో నమోదు చేయడం లేదని
బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం కేసును పక్కదారి పట్టిస్తూ దాడులు చేసే వారికి వత్తాసు పలుకుతుందని విమర్శించారు. గురజాల, చిలకలూరిపేట నియోజకవర్గాలతో పాటు అనేక ప్రాంతాలలో దళితులతో పాటు దళితులు సాగు చేసుకునే భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులపై సామాజికంగా ఆర్థికంగా దళితులు సాగు చేసే భూములపై పెత్తందారుల కళ్ళు పది ఇబ్బంది పాలు చేస్తున్నారని మండిపడ్డారు.రాబోయే రోజుల్లో దీనిపై సిపిఎం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. దాడులు అరికట్టేందుకు పోలీసులు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని దళితులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై రాధాకృష్ణ, ఏపూరి గోపాల్ రావు, ఎస్ ఆంజనేయ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు డి శివ కుమారి,జి మల్లీశ్వరి, కె.హనుమంత రెడ్డి,టి పెద్దిరాజు, జి.బాలకృష్ణ, బి.మహేష్, మహిళా నాయకులు విమల, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*