అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులర్పించిన.. వివిధ సంఘాలు… పల్నాడు జిల్లా పాత్రికేయులు 

 

నరసరావుపేట :

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించి అమరజీవి అయినా మహా పురుషుడు పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట గాంధీచౌక్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పలువురు పాత్రికేయులు, వివిధ సంఘాల వారు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు ఎస్.కె జిలాని మాలిక్, మీడియా మిత్ర ఏపీ ఇంచార్జ్ కొనిజేటి రమేష్, ఆంధ్రప్రభ పాత్రికేయులు పెండ్యాల ప్రసాద్, హెచ్ టివి సీఈవో డి శ్యామ్, హెచ్ టి వి పల్నాడు జిల్లా క్రైమ్ రిపోర్టర్ పి.అంజి, శ్యాం మెట్రో న్యూస్ స్టేట్ బ్యూరో కొత్తూరి రమేష్, శ్యామ్ మెట్రో న్యూస్ పల్నాడు జిల్లా క్రైమ్ రిపోర్టర్ కే.సాగర్, న్యాయం తెలుగు దినపత్రిక పల్నాడు జిల్లా బ్యూరో కంచర్ల శ్రీనివాసరావు, సూర్య దినపత్రిక చిలకలూరిపేట నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీను నాయక్, కాపు సంఘం పల్నాడు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మంచాల వెంకట తిరుపతిరావు, కాపు సంఘం నాయకులు మామిడి నెహ్రూ, బాపట్ల జిల్లా బీసీ నాయకులు గుమ్మ వీరయ్య, వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు ఎస్.కె. జిలాని మాలిక్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోదరణ, అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహానీయుడు అని, ముఖ్యంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అవకశ్యతను చాటిచెప్పిన గొప్ప మహానీయుడు పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ,మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బి.ఆర్.అంబేద్కర్, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు లాంటి మహోన్నత వ్యక్తుల, కార్యసాధకుల అడుగు జాడల్లో నడుస్తూ, మనమందరం వారి ఆశయాల సాధనకు, నిరంతరం కృషి చేయాలని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*