
మార్టూరు :
- మార్టూరులోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయము నందు ఎంపీడీవో జి.నితిన్ అధ్యక్షతన ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ అసిస్టెంట్స్ , సీఆర్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడినది.
👉ఈ సమావేశమునందు RTE-2009 విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా మండలంలోని పేద విద్యార్థులకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 1 వ తరగతి నందు 25% సీట్లలో ప్రవేశాల కొరకు తేది:-18.03.2023 నుండి ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేపించవలసిందిగా వెల్ఫేర్ అసిస్టెంట్స్ కు తెలియజేయడమైనది.👉ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు,సిఆర్పీలు,స్థానిక సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడమైనది.
- 👉 ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.నితిన్ ,మండల విద్యాశాఖ అధికారి ఎం సి హెచ్.వస్రామ్ నాయక్ ,సిఆర్పిలు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.
Be the first to comment