జనసేన పార్టీ ఆధ్వర్యంలో బిటెక్ విద్యార్థికి ఆర్థికంగా చేయూత

 

  • చిలకలూరిపేట :
    గణపవరం గ్రామానికి చెందిన దాసరి భరత్ కుమార్ కళ్ళం ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ బిటెక్ త్రిబుల్ ఈ చదువుతున్నారు. తన తల్లి గారు ఇటీవల అనారోగ్య రీత్యా చనిపోవడం జరిగింది.
  • వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేని తరుణంలో చిలకలూరిపేట జనసేన పార్టీ వారిని సంప్రదించగా మండల లేని చరణ్ తేజ గారు వారి చదువుల నిమిత్తం 16,500 ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ చేతుల మీదుగా ఆ విద్యార్థి కుటుంబానికి అందించడం జరిగింది.
  • ఈ సందర్భంగా తోటరాజ రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న విద్యార్థి కుటుంబాన్ని ఆదుకున్న చరణ్ కు చిలకలూరిపేట జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చిన్న వయసులోనే సేవా గుణాన్ని అలవర్చుకొని తమ వంతు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి చరణ అని , రానున్న కాలంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుందని అన్నారు.
  • ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, చిలకలూరిపేట మండల అధ్యక్షులు బాషా, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, లీలా కిషోర్, శివశంకర్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*