మంత్రి సురేష్ ప్రత్యేక చొరవతో త్రిపురాంతకం దేవాలయం రాజగోపురం నిర్మాణానికి 80 లక్షలు మంజూరు

 

త్రిపురాంతకం :

  • దేవాలయం దక్షిణ రాజగోపుర నిర్మాణం కోసం ప్రభుత్వం 80 లక్షల రూపాయలను మంజూరు చేసింది. కామన్ గుడ్ ఫండ్ (CGF) నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేస్తూ ఆర్ సి నెంబర్ /పీ 1/సిఓఈ/23-28 తో ఈరోజు (18న) దేవదాయశాఖ కమిషనర్ ఎం హరిజవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
  • ప్రసిద్ధిగాంచిన త్రిపురాంతకం దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ త్రిపురాంతకం ఆలయ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు.
  • ఇటీవల శివరాత్రి పర్వదినం నాటికి తన సొంత నిధులు దాదాపు 31 లక్షలు ఖర్చు చేసి ఆలయ ముఖ ద్వారం నిర్మించారు. ప్రస్తుతం రాజగోపుర నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి సారించి దేవాదాయశాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన మంత్రి సురేష్ నిధుల మంజూరు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారు.
  • ఈ మేరకు శనివారం 80లక్షలు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 72 లక్షలు CGF (సర్వ శ్రేయో నిధి) నిధులు కాగా 8 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది.
  • దేవాలయ అభివృద్ధి కి కృషి చేస్తున్న మంత్రి సురేష్ ను ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*