వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసిన చీరాల మొదటి పట్టణ పోలీస్ అధికారులు

 

చీరాల :

 • రూ. 5,00,000/- విలువు కలిగిన 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
 • మోటారు సైకిళ్ళ దొంగతనాల కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్ ఐపీఎస్
 • వివరాలు వెల్లడించిన చీరాల మొదటి పట్టణ ఇన్స్పెక్టర్ వి.మల్లికార్జున రావు
 • ముద్దాయి వివరాలు:
  షేక్.వెంకన్న సాహెబ్ @కన్న, S/o దావూద్ సాహెబ్, వయస్సు 30 సం.లు, దూదేకుల కులం, చేబ్రోలు గ్రామం, ఉంగుటూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా.

ముద్దాయి నేర చరిత్ర:

 • ముద్దాయి గతంలో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగిలించగా తాడేపల్లిగూడెం పోలీస్ వారు అతడిని అరెస్టు చేసి తణుకు సబ్ జైల్ కు తరలించారు. బెయిల్ పై వచ్చిన తర్వాత ఒక మహిళను ప్రేమ వివాహం చేస్తున్నాడు. అతని ప్రవృతి విడనాడకుండా మద్యానికి బానిసగా మారి తన జల్సాలకు డబ్బులకోసం ద్విచక్ర వాహనాలను దొంగిలించడం మరల మొదలు పెట్టినాడు.

ముద్దాయి నేరం చేయు విధానము:

 • బస్టాండ్, రైల్వే స్టేషన్ ల దగ్గరలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల లాక్ లను పెట్టుడు తాళాలతో అన్ లాక్ చేసి దొంగిలించి, వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే చీరాల మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఒంగోలు, గుంటూరు, విజయవాడ లలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిధులలో మొత్తం 18 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు.

కేసు దర్యాప్తు చేసిన విధానం:

 • చీరాల మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన దొంగతనం కేసును బాపట్ల జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్ ఐపీఎస్., ఆదేశాల మేరకు, చీరాల డి.ఎస్.పి పి.శ్రీకాంత్  సూచనలతో, చీరాల మొదటి పట్టణ ఇన్స్పెక్టర్ వి.మల్లికార్జున రావు  పర్యవేక్షణలో ఎస్.ఐ లు ఆర్.అహ్మద్ జానీ, భాస్కర్ రావు లు వారి సిబ్బందితో కేసు దర్యాప్తులో భాగంగా పాత నేరస్థుల పై నిఘా ఉంచగా ఇన్స్పెక్టర్ కి రాబడిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీచేస్తుండగా ముద్దాయి పోలీసువారిని చూచి పారిపోవుటకు ప్రయత్నించగా ఇన్స్పెక్టర్  వారి సిబ్బంది సహకారంతో ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు చీరాల, ఒంగోలు, గుంటూరు, విజయవాడ లలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ల పరిధులలో ఇటీవల 18 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించగా అతడి వద్ద నుండి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచడమైనది.
 • పోలీస్ అధికారులు ముద్దాయి వద్ద నుండి మొత్తం 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు వాటి మొత్తం విలువ రూ.5,00,000/-

అభినందన:

 • కేసుని సమర్ధవంతంగా దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్టు చేసి, 18 మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకొనుటలో ప్రతిభ కనపరిచిన చీరాల మొదటి పట్టణ సిఐ వి.మల్లికార్జునరావు, ఎస్.ఐ ఆర్.అహ్మద్ జానీ, ఎస్.ఐ భాస్కర్ రావు, ఏ.ఎస్.ఐ 1968 పి.సుబ్బారావు, పి.సి 2412 పి.కృష్ణ, హెచ్.జి 690 కె.పరమేష్ లను జిల్లా ఎస్పీ  అబినందించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*