
ఖమ్మం యువకుడి అభిమానం.. గోడపై కోహ్లీ 60 అడుగుల భారీ పెయింటింగ్
రోజు రోజుకు విరాట్ కోహ్లీ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది. మేటి క్రికెటర్లలో ఒకటిగా ఎదిగిన కోహ్లీని తన ఫ్యాన్స్ ఎప్పుడూ ఏదో ఒక విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. తాజాగా ఓ తెలుగు అభిమాని.. కోహ్లీ భారీ పెయింటింగ్ తో తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఖమ్మంకు చెందిన కార్తికేయ అనే యువకుడు గోడపై 60 అడుగుల విరాట్ కోహ్లీ పెయింటింగ్ వేయించాడు. దీంతో ఆ ఫొటోను కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పోయిన ఏడాది విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లో 50 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటుచేశారు. ఈ కటౌట్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ క్రికెటర్ ఫొటోను ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటుచేయలేదు.
Be the first to comment