నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై జరిగిన సమీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

 

గుంటూరు :
  • కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో  గృహ నిర్మాణ శాఖ మాత్యులు  జోగి రమేష్  అధ్యక్షతన జరిగిన గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష సమావేశంలో శాసన మండలి సభ్యులు  మర్రి రాజశేఖర్  పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. అర్బన్ లేఔట్లలో వేగంగా జరుగుతున్న ఇళ్ళ నిర్మాణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా జరగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు లక్ష్యం నెరవేరాలని అందుకు అధికారులు అందరూ సహకరించాలని కోరారు.
  • అనంతరం పెరెచర్ల జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణ ప్రకియను పరిశీలించారు.
  • కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి , గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి , శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం ,MLC లక్ష్మణ రావు , ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్ రావు , కిలారీ రోశయ్య , అన్నాబత్తుని శ్రవణ్ కుమార్ , గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు , గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేకూరి కీర్తి , హౌసింగ్ పీడీలు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*