
•ఆర్ బి కే కేంద్రాల ద్వారైనా కొనుగోలు చేయాలి
•పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
•తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి
బాపట్ల :
- మొక్కజొన్న,వరి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు పర్చూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే ఏలూరి ఒక ప్రకటన విడుదల చేశారు.
- బాపట్ల పార్లమెంట్ వ్యాప్తంగా వరి ,మొక్కజొన్న సాగుకు పెట్టుబడి భారం పెరిగి వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడులతో అన్నదాతలు కుదిలయ్యారని పేర్కొన్నారు. ఈ తరుణంలో పంటలను కొనుగోలు చేయవడంతో రైతులు దిగాలు చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొరగా ఉన్న పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించి సేకరించాలని ఎమ్మెల్యే ఏలూరి డిమాండ్ చేశారు.
- మార్కెట్ మాయాజాలంతో దళారుల బోజ్యంతో 2200 ఉన్న కింటా మొక్కజొన్నలు ఒక్కసారిగా రూ 18 వందలకు పడిపోవడం ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు.మొక్కజొన్న వరి పంటలు ఆరుగాలం కష్టపడి రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాలు ఊబిలో కూరుక పోయారన్నారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల ఉన్నతి కోసం అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని,లేదా ఆర్బికే కేంద్రాల ద్వారా రైతుల ఆశించిన మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
- ఇటివల కురిసిన అకాల వర్షాలకు చేతికొచ్చిన నేల వాలిందని ,ప్రతి రైతుకు అదనంగా పదివేల భారం పెరిగిందన్నారు. దయనీయ స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవాలని, క్షణమే కొనుగోలు కేంద్రాలను వారి చెంతకు చేర్చాలని డిమాండ్ చేశారు. పంట చేతికొచ్చే సమయంలో ధర పతనం కావడంతో ధాన్యం రైతు దిగాలుగా ఉన్నాడన్నారు.
Be the first to comment