
పల్నాడు జిల్లా :
- చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్ వలి, ఉప సర్పంచ్ గొంట్టు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తొలి పాక ప్రభావతి అదేవిధంగా కొంతమంది గ్రామ వాలంటీర్లు, గృహ సారథులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.
- అయితే చిలకలూరిపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు రాష్ట్ర మంత్రి విడదల రజిని గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సంబంధం లేనటువంటి కొంతమందిని కలుపుకొని గడపగడపకు కార్యక్రమం చేపట్టడం వలనే వలనే ప్రజా ప్రతినిధులు మరియు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నట్లు సమాచారం.
- చేస్తున్నటువంటి రాజీనామాలను పార్టీ కమిటీ దృష్టికి తీసుకుపోతున్నట్లు చందవరం కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి వెంకటరామిరెడ్డి తెలిపారు.
- ఈ క్రమంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం రాత్రి గ్రామంలో సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు.
- చిలకలూరిపేట అధికార పార్టీలో గత కొంతకాలంగా కొన్ని అనూహ్య పరిణామాలు విడతల వారీగా చోటు చేసుకోవడం జరుగుతుంది.
- ఏది ఏమైనప్పటికీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇటువంటి మూకుమ్మడి రాజీనామాలు భవిష్యత్తు ఎన్నికల రాజకీయాలలో ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.
Be the first to comment