
చిలకలూరిపేట :
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మే 3వ తేదీ బుధవారం చిలకలూరిపేట నియోజకవర్గ ఏ ఐ టి యు సి అధ్యక్షులు కామ్రేడ్ పేలూరి రామారావును పోలీసులు గృహనిర్బంధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రామారావుకు పోలీసులు నోటీసు అందించడం జరిగింది. కామ్రేడ్ పేలూరి రామారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు గృహనిర్బంధాలు చేయటం ఎంతవరకు సమంజసం కాదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
Be the first to comment