
నరసరావుపేట, (మ్యాక్స్9న్యూస్):
- ముప్పాళ్ళ మండలంలోని మండల వెలుగు కార్యాలయంలో వెన్నెల మండల సమాఖ్య లోని సభ్యులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది .
- ఈ కార్యక్రమానికి సంబంధించి ఏపిఎం బాలస్వామి మాట్లాడుతూ మండలంలోని వైస్సార్ క్రాంతి పదం ద్వారా 24 మంది వివోఏ లకు లోకోస్ యాప్ మీద రెండవ రోజు శిక్షణ ఇవ్వడం జరిగినది .
- ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం జాతీయ గ్రామీణ జీవనోపాదులు క్రింద (NRLM) ఆయా గ్రామాలలో ఉన్న గ్రూపులు అన్నియు మరియు గ్రామ సంఘ సమాచారం పూర్తిగా NRLM లోకోస్ యాప్ క్రింద అన్ని వివరాలు సక్రమంగా చేయుటకై ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది .
- ముఖ్యంగా NRLM క్రింద నమోదు అవ్వడం వలన అందరికీ జీవనోపాదులు, వారి అవసరాలను గుర్తించే ఖమ్మం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫండ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది ఫండ్ ప్రాసెసింగ్ కింద లక్షకు 35%శాతం తో సబ్సిడీ బ్యాంకు ద్వారా లభిస్తుందని ఈ కార్యక్రమం అన్ని గ్రామ సమాఖ్య లలో మరియు గ్రూపులోని ప్రతి సభ్యుని వివరాలను కరెక్టుగా నమోదు చేసుకొనుటకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని తెలియజేశారు.
- ఈ కార్యక్రమంలో సీసీలు నాగరాజు, మల్లేశ్వరరావు, శ్రీలక్ష్మి మరియు టిఓటి భ్రమరాంబ, రమాదేవి, ఎమ్మెలమ్ములు పాల్గొన్నారు.
Be the first to comment