అమరావతి మండలంలో లెమల్లె గ్రామం పంచాయితీ కార్యాలయం ముందు పి.యం.డి.యస్ పై అవగాహన కార్యక్రమం

 

నవధాన్యాలు పంట – రైతులకు సిరుల పంట.!

పల్నాడు జిల్లా (మ్యాక్స్9న్యూస్):

  • అమరావతి మండలం లో లెమల్లె గ్రామం పంచాయితీ కార్యాలయం ముందు పి.యం.డి.యస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు .
    ఈ కార్యక్రమానికి రైతు సాధికార సంస్థ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరావ, పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి, DRC ADA శివ కుమారి ఫాల్గొన్నారు.
  • లేమల్లె గ్రామంలో పంచాయతీ దగ్గర ప్రకృతి వ్యవసాయ రైతులకు PMDS ప్రాముఖ్యత & పిఎండిఎస్ వేసుకోవటం ద్వారా ప్రధాన పంటకు వచ్చే ఉపయోగాలు రైతులకు తెలియజేయడం జరిగింది.
  • పత్తి పంట లో సరిహద్దు పంటలు & అంతర పంటలు గా మొక్కజొన్న, జొన్న, దోస, సజ్జ, గోరు చిక్కుడు వెయ్యడం జరిగింది.
    లేమల్లె గ్రామ సర్పంచ్ ఎలమందయ్య చేతుల మీదగా రైతులకు PMDS పంపిణీ చేయడం జరిగింది.
    రైతు సాధికార సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్రావు మాట్లాడుతూ PMDS అనగా ప్రీమాన్సూన్ డ్రై సేయింగ్ , రుతుపవనాలు రావడానికి ముందుగా 30 రకాల విత్తనాలు వేసుకోవడం ద్వారా భూమికి కావాల్సిన అన్ని పోషకాలు అందించవచ్చు అని తెలియజేశారు.
    ప్రకృతి వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషించటం వలన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు, అధిక పంట దిగుబడులు పొందుతున్నారని ప్రాజెక్ట్ మేనేజర్ అమల కుమారి తెలియజేశారు.
  • DRC శివ కుమారి మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని అదికాదాయం వస్తుందని తెలియజేశారు.
    లేమల్లె గ్రామంలో రైతులు గత సంవత్సరం PMDS వేసుకోవడం ద్వారా పంటల దిగుబడి పెరిగిందని తెలియజేశారు.
    లెమల్లె గ్రామం లో భూమి 32 రకాల విత్తనాలు పప్పు నూనె, పచ్చి రొట్టె, సుగంధ ద్రవ్యాలు విత్తనాలతో 150 కిట్స్ తయారు చెయ్యడం జరిగింది. లెమల్లె గ్రామం లో శ్రీను రైతు పొలంలో చల్లే విధంనం రైతులకు చూపించడం జరిగింది.
  • ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సమయంలో సంఘము లోని మహిళలందరూ వారి ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కిచెన్ గార్డెన్ వేసుకొని ఇంటికి అవసరమైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయ విధానము లో పండించుకోవాలని తెలియజేశారు.
    అమరావతి మండల వ్యవసాయ అధికారి అహ్మద్, గ్రామ వ్యవసాయ సహాయకులు పవను, త్రినాధ్, మాస్టర్ ట్రైనర్ నందకుమార్, హెల్త్ న్యూట్రిషన్ Mt మంగ, యూనిట్ ఇంచార్జెస్ శ్రీ దేవి, ICRP’s, రమాదేవి, పద్మ, మహిళా గ్రామ రైతులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*