
నరసరావుపేట, (మ్యాక్స్9న్యూస్):
- నరసరావుపేట పట్టణంలో నరాలు, మెదడు, వెన్నుముక వ్యాధులకు సంబంధించి ప్రత్యేక హాస్పటల్ అశోక్ న్యూరో కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు రోడ్డు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేయడమైనది .
- కొప్పురావూరి ఆంజనేయులు, డాక్టర్ పాతూరి అశోక్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టిడిపి ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తిరుమల ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ రావెల సత్యనారాయణ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామకృష్ణ పలువురి చేతుల మీదగా అశోక్ న్యూరో కేర్ హాస్పిటల్ ప్రారంభించారు.
- ప్రారంభోత్సవ సందర్భంగా యాజమాన్యం కొప్పురావూరి ఆంజనేయులు, అశోక్ న్యూరో కేర్ హాస్పిటల్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలకు అధునాతన టెక్నాలజీతో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎక్కడో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని మన నరసరావుపేట పట్టణంలోనే అశోక్ న్యూరో కేర్ హాస్పిటల్ అందుబాటులో ఉందని తెలియజేశారు.
Be the first to comment