
యడ్లపాడు:
- మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీభూసమేత రంగనాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఐదో రోజున ఘనంగా నిర్వహించారు.
- ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి, రంగనాయక స్వామి వార్లకు అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు వేదపండితులు పర్చూరి నితిన్‌కుమార్, బృందావనం పార్థసారధి నేతృత్వంలో కల్యాణ వేడుకల్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
- కల్యాణానికి అర్వపల్లి వెంకట హనుమత్ నాగేశ్వరరావు, రమాదేవి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.
- కార్యక్రమంలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్, నాగజ్యోతి, అర్వపల్లి సాంబశివరావు, కామేశ్వరీదేవి, అర్వపల్లి వెంకటస్వామి, వెంకట రాజరాజేశ్వరీ దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గుంటూరు చెందిన వెంకటేశ్వర భక్తబృందం కోలాట ప్రదర్శన చేశారు. కార్యక్రమాలను గ్రామపెద్దలు, ఈవో సీహెచ్ శివయ్య పర్యవేక్షించారు.
Be the first to comment