పంచాయతీ ఎన్నికల వేళ వైసీపీకి షాక్ – యలమంచిలి ఎమ్మెల్యే అరెస్ట్

 

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు మెంబర్‌ను బెదిరించారనే ఆరోపణలతో ఎలమంచిలి ఎమ్మెల్యేను రాంబల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే స్టేషన్ బెయిల్ మీద ఆయన్ను విడిచిపెట్టారు. పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న వార్డు సభ్యుడి అల్లుణ్ని ఎమ్మెల్యే ఫోన్‌లో బెదిరించినట్టు మూడు రోజుల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే కన్నబాబుపై బాధితుడు రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌పై రిలీజ్ చేశారు.  గతంలో ఎప్పుడో మాట్లాడిన ఆడియో టేపులను కలిపి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి బాగుంటుందని సూచించానన్నారు. కొంత మంది పోటీదారులను అనర్హుల్ని చేయించానన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఈ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*