
SEC నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలతో తిరుపతి అర్బన్ SPని మార్చేసిన జగన్ సర్కారు.. ఇన్నాళ్లూ ఆ బాధ్యతలను పర్యవేక్షించిన ఆవుల రమేష్ రెడ్డికి సెక్యూరిటీ వింగ్లో కీలక బాధ్యతలను కట్టబెట్టింది.
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన అధికారులకు జగన్ సర్కారు కీలక పోస్టులు కట్టబెట్టడం ఇదే తొలిసారి కాదు. చిత్తూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన నారాయణ్ భరత్ గుప్తాను రాష్ట్ర నిర్మాణ సంస్థ ఎండీగా నియమించారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన శామ్యూల్ ఆనంద్ కుమార్ను ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైఎస్ చైర్మన్ అండ్ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఎస్ఈసీ ఆదేశాలను అతిక్రమించకుండానే జగన్ సర్కారు.. అధికారులకు కీలక పదవులు కట్టబెడుతుండటం గమనార్హం.
Be the first to comment