
రాష్ట్ర భవిష్యత్తు కోసం 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతి కోసం చేస్తున్న 685 రోజుల సుదీర్ఘ పోరాటానికి కొనసాగింపుగా చేపట్టిన “న్యాయస్థానం-దేవస్థానం” మహా పాదయాత్ర విజయవంతం కావాలని, అమరాతి రాజధానిగా కొనసాగాలని కోరుకుంటూ, రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలియజేసి పాద యాత్రలో పాల్గొనారు. చిలకలూరిపేట నియోజకవర్గ రైతు నాయకులు మద్దూరి వీరారెడ్డి, గుర్రం నాగ పూర్ణ చంద్రరావు, అంబటి సోంబాబు, పోపూరి శివరామ కృష్ణ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుల పాదయాత్రలో పాల్గొనారు.
Be the first to comment