బెదిరిస్తే భయపడడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు – బాలయ్య బాబు ఫైర్

 

అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించారు ఎమ్మెల్యే నందమూరి బాలయ్య. హిందూపురంలోని కిరెకెర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో వార్డు స్థానానికి పోటీలో నిలబడిన నాగరాజు భార్య సుజాత ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చేరారు. విషయం తెలిసి బాలకృష్ణ ఆమెను పరామర్శించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా భరించి పార్టీ కోసం నిలబడిన సుజాతకు చేతులెత్తి దండం పెట్టాలన్నారు. పిల్లల పేరుతో బెదిరించినా సరే ధైర్యంగా నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీనీ ప్రభుత్వం అరాచక పాలనతో భయాందోళన సృష్టిస్తూ ఓట్లే కాదు గాలి కూడా పీల్చే స్వేచ్ఛ లేకుండా చేస్తోందన్నారు బాలకృష్ణ. పార్టీ శ్రేణులు ఎవరూ వైఎస్సార్‌సీపీ బెదిరింపులకు తలొగ్గద్దని.. తన ప్రాణాలు అడ్డు వేసైనా కార్యకర్తలను రక్షించుకుంటాను అన్నారు. ‘మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఒకరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉక్కు కారాగారం అంటున్నారని.. సీబీఐ కేసులతో కారాగారం అలవాటైందని చురకలంటించారు.ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. బెదిరిస్తే భయపడడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరన్నారు. తమను బెదిరించాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని..హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో యువతకు ఉద్యోగాల మాటేమో గానీ మద్యం, గంజాయి వంటివి మాత్రం అందుబాటులో ఉన్నాయన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*