
న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివసిస్తున్న రాబర్ట్ బ్యారాన్ అనే 63 ఏళ్ల వ్యక్తి.. తన కంటే వయస్సులో పెద్దదైన 70 ఏళ్ల భార్య సుంచా తినేవ్రాతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవల పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇందుకు కారణం భర్తకు కాఫీ ఇవ్వడమే. అదేంటీ.. కాఫీ కలిపి ఇస్తే అరెస్టు చేసేస్తారా అనేగా మీ సందేహం. ఏం జరిగిందో తెలిస్తే.. ఆమెకు మీరు కూడా చివాట్లు పెడతారు. గతడాది సెప్టెంబరు నుంచి భార్య కలిపి ఇస్తున్న కాఫీ తాగగానే అతడు అస్వస్థతకు గురయ్యేవాడు. ఒక్కోసారి అలసట ఎక్కువై 15 గంటలు నిద్రపోయేవాడు. అతడికి ఏమవుతుందో అర్థమయ్యేది కాదు. అయితే, అది కాఫీ తాగడం వల్ల జరుగుతుందా? లేదా తాను ఏదైనా అనారోగ్యానికి గురయ్యానా అని వైద్యులను సంప్రదించగా ఎలాంటి సమస్య లేదని తెలిసింది. వైద్యుడిని కలిసిన తర్వాత కూడా కాఫీ తాగిన తర్వాత అతడికి మగతగా అనిపించేది. దీంతో అతడికి తన భార్య మీద అనుమానం కలిగింది. కాఫీలో ఏమైనా కలుపుతుందా? అనే సందేహం ఏర్పడింది. నేరుగా అడిగితే గొడవ పెట్టుకుంటుందని, సరైన ఆధారాలు లేకుండా ఆమెను నిలదీయడం కష్టమని భావించాడు. ఆమెకు తెలియకుండా వంటగదిలో నిఘా కెమేరా పెట్టాడు.
ఎప్పటిలాగానే భార్య అతడికి కాఫీ కలిపి ఇవ్వడం చూశాడు. అయితే, ఆమె అందులో ఏమీ కలుపుతున్నట్లు కనిపించలేదు. అలా కొన్ని రోజులు గమనించాడు. అయితే, ఓ రోజు మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కెమేరాలో రికార్డైన వీడియోలను గమనించాడు. ఈసారి మాత్రం షాకయ్యాడు. ఎందుకంటే.. ఆమె కాఫీలో చక్కెరతోపాటు తెల్లగా ఉండే మరో పదార్థాన్ని కలుపుతోంది. అదేమిటనేది తెలియలేదు. దీంతో ఆమె వంటగదిలో లేని సమయంలో వెళ్లి పరీక్షిస్తే.. అది. పోలీసులు ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. భర్తపై కోపం వచ్చినప్పుడు కాఫీలో బోరిక్ యాసిడ్ కలిపేదాన్ని అని తెలిపింది. అతడికి తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఆ పనిచేశానని, చంపే ఉద్దేశం లేదని పేర్కొంది. వారం రోజులు పోలీసులు కస్టడీలో ఉన్న ఆమెను పోలీసులు బెయిల్ అవసరం లేకుండానే విడిచిపెట్టారు. భద్రతా నేపథ్యంలో.. ఆమె ఎట్టి పరిస్థితుల్లో భర్తను కలవకూడదని కోర్టు ఆదేశించింది. చూశారుగా.. మీ భార్యతో గొడవ పడే ముందు.. ఆ తర్వాత ఒకసారి ఆలోచించండి. మీపై రివేంజ్ తీర్చుకోడానికి ఒక్క కాఫీ చాలు!!
Be the first to comment