
శుక్రవారం నాడు అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అఖిలకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు భార్గవ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. శనివారం (జనవరి 23) అఖిలప్రియ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Be the first to comment