
ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కర్భన ఉద్గారాలు. అభివృద్ధి పెరిగిన కొద్ది ఉద్గారాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. అతివృష్టి, అనావృష్టి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ నయా సవాల్‌ని తెర మీదకు తెచ్చారు. అంతే కాదండోయ్ గెలిచిన వారికి 100 మిలియన్ డాలర్ల(7,30,05,50,000 రూపాయలు) భారీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు. ‘‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు.
Be the first to comment